ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామానికి చెందిన 5, 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల పేరుతో పిటిషన్ దాఖలైంది. దీనిపై బుధవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే ధర్మాసనం... ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. గతంలో ఆంగ్ల మాధ్యమం అంశంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లకు దీనిని జత చేసింది.
ఇదీ చదవండి