ETV Bharat / city

పదివేల కోట్ల మేర తగ్గిన రాబడి... ప్రత్యామ్నాయాలపై దృష్టి - ఏపీ ఆర్థిక పరిస్థితి వార్తలు

రోజురోజుకూ రెవెన్యూ దిగజారుతుండటంతో ఆర్థికంగానూ రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కరోనా ప్రభావంతో ఆదాయాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రెండు త్రైమాసికాల్లో పదివేల కోట్ల మేర రెవెన్యూను రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయింది. ఫలితంగా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు వివిధ రకాల ప్రత్యామ్నాయాలను అమలు చేస్తోంది.

andhrapradesh
andhrapradesh
author img

By

Published : Oct 2, 2020, 4:14 PM IST

కరోనా ప్రభావం రాష్ట్ర రెవెన్యూపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి రెండు త్రైమాసికాల్లో రాష్ట్ర రెవెన్యూ గణనీయంగా పడిపోయింది. గతేడాది ఇదే కాలానికి పోలిస్తే ప్రస్తుతం పదివేల కోట్ల రూపాయల మేర తగ్గుదల నమోదైంది. అసలే అప్పుల కుప్పగా మారుతున్న రాష్ట్రానికి ఆదాయం కోల్పోవటం తలనొప్పిగా పరిణమిస్తోంది. దీంతో ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం వివిధ మార్గాల్ని అన్వేషిస్తోంది.

2020-21 ఆర్ధిక సంవత్సరంలో ఏప్రిల్ నెలకుగానూ వివిధ శాఖల ద్వారా వచ్చిన ఆదాయం 3062 కోట్లుగా నమోదైంది. 2019తో పోలిస్తే దాదాపు 100 కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది. ఇక మే 2020కి వచ్చిన ఆదాయం 3683 కోట్లుగా తేలింది. అటు జూన్ నెలకు 5 వేల 785 కోట్లు రెవెన్యూ రాబడి వచ్చింది. జూలైలో 6583 కోట్లు, ఆగస్టులో 5883 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. మొత్తంగా ఐదు నెలల కాలానికి 24 వేల 998.50 కోట్ల రూపాయల రెవెన్యూ వసూలు అయితే... 2019-20లో ఇదే కాలానికి 34939 కోట్ల రూపాయల మేర ఆదాయం వచ్చింది. దీంతో రాష్ట్ర రెవెన్యూ వసూళ్లు దాదాపు 10 వేల కోట్ల రూపాయల మేర తగ్గాయి.

రెవెన్యూ రాబడులు తగ్గిపోవటంతో రాష్ట్ర ప్రభుత్వం... ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు వివిధ రకాల ప్రత్యామ్నాయాలను అమలు చేస్తోంది. ఇటీవలే వ్యాట్ ధరలు సవరించి పెట్రోలు, డీజిల్ పై 1 రూపాయి అదనంగా సెస్ వేసింది. దీంతో అదనంగా 300 కోట్ల రూపాయలమేర ఆదాయం రానుంది. అటు సహజ వాయువు వాణిజ్య వినియోగంపైనా 10 శాతం మేర వ్యాట్ పన్ను పెంచారు. దీనిపై 600 కోట్ల రూపాయల మేర ఆదాయం సమకూరుతుంది. ఇక భూమి విలువలు పెంచటంతో స్టాంపు డ్యూటీ పరంగాను, రిజిస్ట్రేషన్ల పరంగానూ ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది.

ఇదీ చదవండి

'మా పార్టీకి సిద్ధాంతాలున్నాయి.. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.