ETV Bharat / city

ఫ్యాన్సీ నెంబర్ల రిజిస్ట్రేషన్ ఫీజు భారీగా పెంచనున్న ప్రభుత్వం - fancy numbers in Ap

వాహనాల ఫ్యాన్సీ నెంబర్ల రిజిస్ట్రేషన్ ఫీజును భారీగా పెంచాలని నిర్ణయించింది ఏపీ రవాణా శాఖ. ఇందుకు సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ద్వారా ఏడాదికి రూ.100 కోట్ల మేర అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Andhrapradeh govt to increase fancy numbers registration fee
ఫ్యాన్సీ నెంబర్ల రిజిస్ట్రేషన్ ఫీజు భారీగా పెంచనున్న ప్రభుత్వం
author img

By

Published : Jun 10, 2022, 4:30 AM IST

ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూర్చే దిశగా ఏపీ రవాణా శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వాహనాల ఫ్యాన్సీ నెంబర్ల రిజిస్ట్రేషన్ ఫీజును భారీగా పెంచుతూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫ్యాన్సీ నెంబర్ల రిజిస్ట్రేషన్ ఫీజును కనిష్టంగా రూ.5వేల నుంచి గరిష్టంగా రూ.2 లక్షలు వరకు ఏపీ రవాణాశాఖ ప్రతిపాదించింది. దీని ద్వారా ఏడాదికి రూ.100 కోట్ల మేర అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరోవైపు 9999 ఫ్యాన్సీ నెంబరుకు రూ.2 లక్షల మేర రిజిస్ట్రేషన్ ఫీజును నిర్ధారించిన రవాణా శాఖ.. ఇతర ఫ్యాన్సీ నెంబర్లకు రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.5 వేల చొప్పున ఫీజును నిర్ణయించింది. ఈ మేరకు చట్ట సవరణ కోసం ఏపీ రవాణా శాఖ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసిన 15 రోజుల్లోగా అభ్యంతరాలేమైనా ఉంటే తెలపాలని ప్రభుత్వం సూచించింది.

ఇదీ చదవండి: వివేకా హత్య కేసు.. శివశంకర్‌రెడ్డి పిటిషన్‌ కొట్టేసిన న్యాయస్థానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.