ETV Bharat / city

అప్పుల ఊబిలో రాష్ట్రం... అందని కేంద్ర సాయం - Andhra Pradesh's public debt mounts

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంపై ఇప్పటికే 16వేల 206 కోట్ల రూపాయలకుపైగా రుణభారం పడింది. బడ్జెట్‌ పరిధిలోకి రాని అప్పులను లెక్కలోకి తీసుకోకపోగా ఈ మొత్తం తేలింది. గత కొన్నేళ్లుగా పెను సవాళ్లను ఎదుర్కొంటున్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ... 2018-19 నుంచి అప్పులపైనే రాష్ట్రాన్ని నడిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంచనాల మేర కేంద్రం నుంచి గ్రాంట్లు, ఇతర నిధులు రాకపోవటం వలన బడ్జెట్‌ గాడితప్పుతోంది. ఈ కారణంగా అప్పులపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది.

అప్పుల ఊబిలో రాష్ట్రం... అందని కేంద్ర సాయం
author img

By

Published : Oct 13, 2019, 6:08 AM IST

అప్పుల ఊబిలో రాష్ట్రం... అందని కేంద్ర సాయం

2019-20 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా దాదాపు 31వేల కోట్ల రూపాయలకుపైగా అప్పు చేయాల్సి ఉంటుందని బడ్జెట్‌ అంచనాల్లో పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి రాష్ట్ర అప్పుల మొత్తం 2లక్షల 91 వేల 345 కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా. అయితే తొలి ఆరునెలల్లోనే అప్పుల వాటా అంచనాల్లో సగం దాటడం కలవరపెడుతోంది. బహిరంగ మార్కెట్‌ నుంచి నికరంగా 14వేల 168 కోట్ల రూపాయల అప్పు తీసుకోగా.... పౌరసరఫరాల కార్పొరేషన్‌ ద్వారా 5వేల కోట్ల రూపాయలు, ఏపీ ట్రాన్స్‌కో ద్వారా మరో 2వేల 250 కోట్ల రూపాయల రుణం పొందినట్టు తెలుస్తోంది.

కేంద్రం నుంచి రావాల్సినా...!

పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్రం ఖర్చు చేసిన నిధులు కేంద్రం నుంచి రావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఖర్చు చేసిన 5వేల 500 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. గతేడాది జులై తర్వాత పోలవరానికి సంబంధించిన నిధులు కేంద్రం నుంచి విడుదల కాలేదు. 3వేల 500 కోట్ల రూపాయల విడుదలకు కేంద్ర జల్‌శక్తి నుంచి ప్రక్రియ పూర్తి చేసుకుని ఆర్థికశాఖకు ప్రతిపాదనలు వెళ్లినా ఇంతవరకూ దానిపై ఎలాంటి స్పందనా లేదు. కేంద్రం అడిగిన అన్ని సందేహాలకు మాత్రం తాము సమాధానం ఇచ్చినట్టు రాష్ట్ర అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి :

'ఆర్థిక చక్రాన్ని రివర్స్ చేసి... ఆదాయ మార్గాలకు గండికొట్టారు'

Intro:FILENAME: AP_ONG_31_12_SRINIVASA_KALYANAM_PALGONNA_MANTRI_AV_AP10073
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONFAPALEM, PRAKSHAM

శ్రీనివాస కల్యాణ ట్రస్ట్ అద్వర్యం లో ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం పెద్ద బొమ్మలపురం లో శ్రీనివాస కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముక్య అతిధిగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి అదిములపు సురేష్, భక్తులు పాల్గొన్నారు. స్వామి వారి కల్యాణం కనులారా చూసి తరించారు. ట్రస్టు అద్వర్యం లో ఎన్నో ఏళ్లుగా శ్రీనివాసుని నిత్య సేవలు, నిర్వహిస్తున్నామని, తిరుమలలో జరిగే విధంగా కళ్యాణత్సవం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యమానికి పెద్ద సంఖ్య లో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు అందుకున్నారుBody:Kit nom 749Conclusion:9390663594
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.