- మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్
హీరో చిరంజీవికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆచార్య సినిమా చిత్రీకరకణ కోసం కరోనా పరీక్షలు నిర్వహించగా.. లక్షణాల్లేకున్నా కరోనా పాజిటివ్ వచ్చిందని చిరంజీవి వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మధ్యలోనే ఆగిపోయిన ఇంజనీరింగ్ కౌన్సెలింగ్... ఆందోళనలో విద్యార్థులు
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మధ్యలోనే ఆగిపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అయోమయంలో పడ్డారు. కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్లు భర్తీ అయిపోతుండటంతో కన్వీనర్ కోటా తర్వాత కోరుకున్న బ్రాంచిలో సీట్లు ఉంటాయో లేదోనని విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు మిగిల్చిన నష్టాన్ని అంచనా వేయడానికి రెండు రోజుల పాటు కేంద్ర బృందాల పర్యటించనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- ఏడుగురు మృతి
మధ్యప్రదేశ్‌లో ట్రక్కు, కారు ఢీ కొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో మరో 45,903 మందికి కరోనా
భారత్‌లో తాజాగా 45,903 కేసులు నమోదయ్యాయి. మరో 490 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 85 లక్షల 53 వేలు దాటింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- యూపీలో మరో దారుణం.. ఆరేళ్ల బాలికపై హత్యాచారం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో మరో దారుణమైన ఘటన జరిగింది. ఆరేళ్ల బాలికపై హత్యాచారం జరిగింది. ఈ కేసులో ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చర్చికి బైడెన్.. గోల్ఫ్ కోర్సుకు ట్రంప్..
అమెరికా ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం నూతన అధ్యక్షుడు జో బైడెన్ చర్చికి వెళ్లగా.. వర్జీనియాలోని గోల్ఫ్ కోర్సుకి వెళ్లారు ట్రంప్. అక్కడ ఆయనకు అనుకూలంగా, వ్యతిరేకంగా కొందరు ప్లకార్డులు ప్రదర్శించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఈటా తుపాను బీభత్సం-15 మంది మృతి
మధ్య అమెరికా, మెక్సికోలో బీభత్సం సృష్టించిన ఈటా తుపాను.. క్యూబా, దక్షిణ ఫ్లోరిడాపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ తుపాను ధాటికి పదుల సంఖ్యలో మరణించగా.. 100 మందికిపైగా గల్లంతయ్యారు. ఫ్లోరిడా రాష్ట్రంలో అత్యయిక స్థితిని ప్రకటించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఆ వేలంలో హోల్డర్‌ను తీసుకోకపోవడం ఆశ్యర్యమేసింది'
2019 ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్‌ను ఎవరూ తీసుకోకపోవడం తనకెంతో ఆశ్చర్యమేసిందన్నాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గంభీర్. అతడు గొప్ప ఆటగాడని ప్రశంసించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విద్యాబాలన్ 'నట్‌ఖట్'కు అరుదైన గౌరవం
బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించిన లఘుచిత్రం 'నట్‌ఖట్'.. ఈ ఏడాదికి గానూ భారతీయ లఘు చిత్ర పురస్కారాల్లో విజేతగా నిలిచింది. దీంతో ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల పరిశీలనకు నేరుగా అర్హత సాధించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.