- ఏవోబీలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులోని గున్నమామిడి వద్ద ఎదురుకాల్పులు జరిగాయి. అనంతరం ఘటనా స్థలం నుంచి భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- రాష్ట్రంలో కొత్తగా 2,949 కరోనా కేసులు నమోదు
రాష్ట్రంలో కొత్తగా 2,949 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్ వైరస్ కారణంగా తాజాగా మరో 18 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 3,609 మంది కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'అన్నం పెట్టే రైతు చేతులకు సంకెళ్లు వేస్తారా?'
కృష్ణాయపాలెం రైతులకు అమరావతి అన్నదాతలు మద్దతుగా నిలిచారు. అన్నం పెట్టే రైతులకు సంకెళ్లు వేస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. వివిధ గ్రామాల్లో 316వ రోజు అమరావతి రైతుల దీక్ష కొనసాగింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- దారుణం... కన్నకూతురిపై తండ్రి అత్యాచారం!
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఆ తండ్రి... దారుణానికి ఒడిగట్టాడు. కొండంత భరోసా ఇస్తాడనుకున్న ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తండ్రి ముసుగులో తనలోని రాక్షసుడిని బయటపెట్టాడు. మానవ సంబంధాలను మంటగలిపిన ఈ ఘటన విశాఖపట్నం జిల్లా మల్కాపురం ఠాణా పరిథిలో జరిగింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- కేంద్ర మంత్రి హరిదీప్సింగ్తో ఎంపీ కేశినేని భేటీ
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరిదీప్‌సింగ్ పూరీతో ఎంపీ కేశినేని నాని బుధవారం భేటీ అయ్యారు. విజయవాడలో డ్రైనేజీ ఆధునీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయని... అవి త్వరగా పూర్తి చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'కొవిడ్ కేసులు, మరణాలు భారత్‌లో తక్కువే'
కరోనా కట్టడికి ప్రభుత్వాలు తీసుకుంటున్న సమర్థమైన చర్యలు, వ్యూహాల వల్ల దేశంలో కొవిడ్ కేసులు, మరణాలు తక్కువగా నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రపంచ దేశాలతో పోల్చితే తక్కువ కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ ఒకటని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- సైనిక బలగాలపై రక్షణమంత్రి ప్రశంసల జల్లు
సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో సైన్యం వ్యవహరిస్తున్న తీరును ప్రశసించారు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు ఎదురైన సవాళ్లు ఎదుర్కొవడంలో సైన్యం కీలక పాత్ర పోషించిందని కొనియాడారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- బిహార్‌లో తొలిదశ పోలింగ్ ప్రశాంతం
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలిదశ పోలింగ్ ముగిసింది. మూడుదశల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో.. మొదటి దఫాలో భారీగానే ప్రజలు ఓటుహక్కు వినియోగించుకున్నారు. మొత్తం 71 స్థానాలకు 1,066 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- రోహిత్ శర్మను అందుకే ఎంపిక చేయలేదా?
- భారత జట్టు ఫిజియో నితిన్ పటేల్ రిపోర్ట్ వల్లే రోహిత్‌ను ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేయలేదని, కోలుకుంటే జట్టులోకి వచ్చే అవకాశముందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- రకుల్ ర్యాప్ సాంగ్ అదిరిందిగా!
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఓ హిందీ ర్యాప్ పాటను అద్భుతంగా పాడి.. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోందీ వీడియో. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి