పదో తరగతి పరీక్షల ఫలితాలకు (Tenth results) మరో వారం సమయం పట్టనుంది. అంతర్గత పరీక్షల మార్కుల (Tenth marks) వివరాల సేకరణలో జాప్యం జరగడంతో ఫలితాల వెల్లడి ఆలస్యమవుతోంది. మార్కుల సేకరణ అనంతరం పాఠశాల విద్యాశాఖ.. ప్రభుత్వ పరీక్షల విభాగానికి జాబితాను అందించాల్సి ఉంటుంది. అనంతరం ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.
కరోనా (covid effect) దృష్ట్యా పదో తరగతి పరీక్షలను (Tenth results) ప్రభుత్వం రద్దు చేయగా.. ఫలితాల (Tenth results) వెల్లడికి ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. 50 మార్కులకు పెట్టిన ఫార్మెటివ్ పరీక్షలో.. 20 మార్కుల రాత పరీక్షకు 70శాతం, ఇతర 30 మార్కులకు 30శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులకు 50 మార్కుల చొప్పున రెండు ఫార్మెటివ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో రాత పరీక్షకు 20 మార్కులు, ప్రాజెక్టులకు10, నోటు పుస్తకాల రాతకు 10, తరగతిలో పిల్లల భాగస్వామ్యానికి 10 మార్కులు కేటాయించారు. పరీక్ష మొత్తం 50 మార్కుల సగటు తీసుకోగా.. దీనిలో 70శాతం అంటే 35 మార్కులను వెయిటేజీగా తీసుకుంటారు. రాత పరీక్ష 20 మార్కులను 35కు తీసుకువస్తారు.
ఉదాహరణకు ఓ విద్యార్థికి రాతపరీక్షలో 20 మార్కులకుగానూ 18 వస్తే.... 35 మార్కులకు దాన్ని లెక్కిస్తే.. విద్యార్థి స్కోర్ 31.5 మార్కులకు చేరుతుంది. మిగతా 30 మార్కులను 30శాతం వెయిటేజీతో 15మార్కులకు కుదిస్తారు. విద్యార్థికి 30మార్కులకుగానూ 27 వస్తే వెయిటేజీ ప్రకారం 13.5గా పరిగణిస్తారు. మొత్తం కలిపి ఫార్మెటివ్‌లో 45మార్కులు వచ్చినట్లు లెక్కిస్తారు. ఈ విధానంలోనే రెండో ఫార్మెటివ్ పరీక్షలోని మార్కులనూ లెక్కించనున్నారు.
రెండు ఫార్మెటివ్ పరీక్షల్లో వచ్చిన మార్కులను కలిపి సబ్జెక్ట్ గ్రేడ్ ప్రకటిస్తారు. అన్ని మార్కులను కలిపి మొత్తం గ్రేడ్ ఇస్తారు. హిందీ సబ్జెక్ట్‌కు సంబంధించి గ్రేడ్లు ఒక విధంగానూ, మిగతావాటికి మరో విధంగానూ నిర్ణయించారు. విద్యార్థులకు (tenth students) వచ్చిన మార్కుల ఆధారంగా వారి గ్రేడ్లు (tenth grades) ఈ విధంగా ఉండనున్నాయి.
ఇదీ చదవండి:
Jagan bail cancel petition: జగన్ బెయిల్ రద్దుపై సీబీఐ కోర్టులో ముగిసిన విచారణ.. ఆగస్టు 25న తీర్పు
ROADS: రాష్ట్ర రహదారుల పనులపై గుత్తేదారుల నిరాసక్తి.. 3సార్లు టెండర్లు పిలిచినా మూడో వంతుకే బిడ్లు
Fire accident: అయ్యో.. వలస కార్మికులు.. ఆరుగురి ప్రాణాలు అగ్గిపాలు..!