Food security rankings: జాతీయ ఆహార భద్రత చట్టం అమలులో ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లు తొలి మూడు ర్యాంకులు కైవశం చేసుకున్నాయి. తెలంగాణ సాధారణ రాష్ట్రాల్లో 12, సాధారణ, ప్రత్యేకహోదాగల రాష్ట్రాల ఉమ్మడి ర్యాంకుల్లో 14వ స్థానంలో నిలిచింది. మంగళవారం దిల్లీలో జరిగిన సదస్సులో కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌గోయల్ తొలిసారి జాతీయ ఆహార భద్రత చట్టం సూచీ ర్యాంకులను విడుదల చేశారు.
ఆహార భద్రత చట్టం కింద కవరేజి, అర్హులైన వారిని లక్ష్యంగా చేసుకొని ప్రయోజనాలు అందించడం, ఆహార భద్రత చట్టంలోని నిబంధనల అమలు, తిండి గింజల కేటాయింపు, వాటి రవాణా, చౌక దుకాణాలకు సరఫరా, పౌష్టికాహారం అందించడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల ఆధారంగా ఈ ర్యాంకులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాలూ డిజిటైజేషన్, ఆధార్ అనుసంధానం, ఈపోస్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు ఈ నివేదిక పేర్కొంది.
ఆహారభద్రతా చట్టం కవరేజి, టార్గెటింగ్, చట్టంలోని నిబంధనల అమలు విభాగంలో ఏపీకి 8, తెలంగాణకు 21వ ర్యాంకులు దక్కాయి. డెలివరీ ప్లాట్‌ఫాం విభాగంలో ఏపీకి 2, తెలంగాణకు 3వ స్థానం వచ్చాయి. ఈ నివేదిక విడుదల సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డుల జారీకి ఆధార్ అనుసంధాన ప్రజాపంపిణీ వ్యవస్థను ఉపయోగించనున్నట్లు చెప్పారు.
ఇవీ చూడండి: