ETV Bharat / city

ELECTRICITY: జగనన్న కాలనీలు, టిడ్కో నివాసాలకు విద్యుత్ సరఫరాపై ఉన్నతాధికారుల సమీక్ష - జగనన్న కాలనీలకు విద్యుత్​ సరఫరా తాజా వార్తలు

జగనన్న కాలనీలు, టిడ్కో నివాసాలకు విద్యుత్ సరఫరా అంశంపై సచివాలయంలో ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ మూడు డిస్కమ్​లకు చెందిన సీఎండీలతో ఈ అంశాలపై చర్చించారు. జగనన్న కాలనీలకు విద్యుత్ కనెక్షన్లను ఇచ్చేందుకు ఎంత మొత్తంలో ఖర్చు అవుతుందన్న అంశంపై సమీక్షించారు.

Andhra pradesh power secretory meet discoms officials

author img

By

Published : Sep 1, 2021, 4:51 PM IST

రాష్ట్రవ్యాప్తంగా నిర్మించనున్న జగనన్న కాలనీలతో పాటు టిడ్కో నివాసాలకు విద్యుత్ సరఫరా అంశంపై సచివాలయంలో ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మూడు విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు హాజరయ్యారు. ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ మూడు డిస్కమ్​లకు చెందిన సీఎండీలతో ఈ అంశాలపై సమీక్షించారు. వివిధ జిల్లాల్లో నిర్మాణం కానున్న జగనన్న కాలనీలకు విద్యుత్ కనెక్షన్లను ఇచ్చేందుకు ఎంత మొత్తంలో ఖర్చు అవుతుందన్న అంశంపై చర్చించారు. లే ఆవుట్లలో విద్యుత్ స్థంభాల ఏర్పాటు, ట్రాన్స్​ఫార్మర్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్ష నిర్వహించారు.

ఆయా డిస్కమ్​ల పరిధిలో దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేసుకోవాల్సిందిగా ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ సూచించారు. మరోవైపు ట్రూ ఆప్ ఛార్జీల సర్దుబాటు వ్యవహారంపైనా ఇంధన శాఖ కార్యదర్శి డిస్కమ్​ల సీఎండీలతో చర్చించారు. సిబ్బంది జీతాలు, బొగ్గు, విద్యుత్ కొనుగోలు వ్యయం తదితర ఛార్జీలను వినియోగదారులకు బదిలీ చేసేందుకు ఏపీఈఆర్సీ అంగీకారాన్ని తెలిపిందని అందుకు తగినట్టుగానే సర్దుబాటు ఛార్జీలను వసూలు చేస్తున్నట్లు సమావేశంలో చర్చించారు.

ఇదీ చదవండి:

RRR: 'సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అనడం దారుణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.