ETV Bharat / city

'అన్నీ బయటకు వచ్చేశాయి..సవరించాల్సిన అవసరం ఏముంది'

అమరావతి భూముల విషయంలో అనిశా నమోదు చేసిన కేసులో తాము ఇచ్చిన గ్యాగ్ ఉత్తర్వులు... సీఎం సలహాదారు అజేయకల్లం నిర్వహించిన ప్రెస్‌మీట్‌తో నిష్ఫలం అయ్యాయని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎఫ్‌ఐఆర్, ఇతర అంశాలన్నీ బయటపడ్డాయని స్పష్టం చేసింది.

ap hc
ap hc
author img

By

Published : Oct 17, 2020, 4:31 AM IST

రాజధాని భూముల విషయంలో అవినీతి నిరోధకశాఖ (అనిశా) నమోదు చేసిన కేసులో వివరాలను మీడియా వెల్లడించకుండా నిలువరిస్తూ తాము ఇచ్చిన గ్యాగ్‌ ఉత్తర్వులు.. ముఖ్యమంత్రి సలహాదారు అజేయకల్లం నిర్వహించిన ప్రెస్‌మీట్‌తో నిష్ఫలం అయ్యాయని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఎఫ్‌ఐఆర్, ఇతర అంశాలు, ముఖ్యమంత్రి రాసిన లేఖ అన్నీ బయటపడ్డాయని స్పష్టం చేసింది. దీంతో కేసు వివరాలను తెలుసుకునే హక్కు తమకుందని, అవి తెలిపేలా గ్యాగ్‌ ఉత్తర్వులను సవరించాలంటూ న్యాయవాది మమతారాణి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌లో ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని తెలిపింది. ఆమెను ప్రతివాదిగా చేర్చాల్సిన అవసరం లేదంది. ప్రధాన వ్యాజ్యంలో మిగిలిన అనుబంధ పిటిషన్లు రోస్టర్‌ ప్రకారం తగిన బెంచ్‌ ముందుకు విచారణకు వస్తాయని స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ జేకే మహేశ్వరి శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. ప్రస్తుత అనుబంధ పిటిషన్‌లో ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు.

ప్రభుత్వ న్యాయవాది సుమన్‌ స్పందిస్తూ.. సీజేఐకి ముఖ్యమంత్రి రాసిన లేఖ వ్యవహారానికి సంబంధించి మాత్రమే ప్రెస్‌మీట్‌ నిర్వహించారన్నారు. అనిశా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ గురించి కాదన్నారు. మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ తరఫు న్యాయవాది ప్రణతి స్పందిస్తూ.. గ్యాగ్‌ ఉత్తర్వులిచ్చాక కూడా ఫేస్‌బుక్‌లో పెట్టిన అభ్యంతరకర పోస్టింగులు తొలగించేలా ఆదేశించాలని కోరుతూ అనుబంధ పిటిషన్‌ వేశామన్నారు. వాటిపై అత్యవసర విచారణ అవసరం ఉంటే హైకోర్టు రిజిస్ట్రీని అభ్యర్థించాలని సీజే సూచించారు. రోస్టర్‌ ప్రకారం తగిన బెంచ్‌ ముందుకు ఆ అనుబంధ పిటిషన్లు విచారణకు వస్తాయన్నారు.

ఇదీ చదవండి

ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక సరిహద్దుల గుర్తింపునకు కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.