పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు.. ఉపాధ్యాయులు సహకరించాలని పాఠశాల విద్యాశాఖ సూచనలు జారీ చేసింది. సెలవుల్లో విద్యార్థులకు డిజిటల్ మార్గాల ద్వారా.. సందేహాలు తీర్చాల్సిందిగా సూచనలిచ్చింది. జూన్ 1 నుంచి 5 వరకు పాఠశాలలకు రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది. పదో తరగతి పరీక్షల నిర్వహణకు సిద్ధం కావాల్సిందిగా రీజినల్ డైరెక్టర్లను ఆదేశించింది. పదో తరగతి విద్యార్థులకు మే 1 నుంచి 31 వరకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం... సెలవుల్లో పరీక్షలకు సిద్ధం కావాల్సిందిగా విద్యార్థులకు విద్యా శాఖ సూచించింది.
ఇదీ చదవండి:
కిరాతకం: కట్టుకున్నదాన్ని.. కడుపున పుట్టిన వాళ్లని వదల్లేదు..