ETV Bharat / city

9 నెలల రుణం 5 నెలల్లోనే తీసుకొచ్చిన రాష్ట్రం - ap brought the 9-month loan within 5 months

కేంద్ర ప్రభుత్వం తొలి 9 నెలల కాలానికి ఎంత అప్పు తీసుకునేందుకు అనుమతిచ్చిందో ఆ మొత్తాన్ని 5 నెలల్లోనే రాష్ట్రం తీసుకొచ్చింది. రిజర్వు బ్యాంకు మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని రూ.వెయ్యి కోట్ల రుణం తీసుకుంది.

andhra-pradesh-government-has-borrowed-rs-1000-crore-from-the-reserve-bank
9 నెలల రుణం 5 నెలల్లోనే తీసుకొచ్చిన రాష్ట్రం
author img

By

Published : Sep 1, 2021, 7:08 AM IST

ప్రస్తుతం తనకున్న బహిరంగ మార్కెట్‌ రుణ పరిమితి మేరకు మొత్తం అప్పును ఆంధ్రప్రదేశ్‌ తీసేసుకుంది. రిజర్వు బ్యాంకు మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని రూ.వెయ్యి కోట్ల రుణం తీసుకుంది. రాబోయే 14 ఏళ్లలో ఈ అప్పు తీర్చేందుకు అంగీకరిస్తూ 7.05 శాతం వడ్డీ చెల్లించేందుకు సిద్ధమైంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.20,751 కోట్ల మేర రుణం తీసుకున్నట్లయింది. కేంద్ర ప్రభుత్వం తొలి 9 నెలల కాలానికి ఎంత అప్పు తీసుకునేందుకు అనుమతిచ్చిందో ఆ మొత్తం పరిమితి మేరకు రుణ స్వీకరణ పూర్తయింది. 9 నెలల్లో తీసుకునేందుకు అవకాశమున్న అప్పు 5 నెలల్లోనే రాష్ట్రం తీసేసుకుంది. ఈ రుణ పరిమితిని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విన్నవిస్తూ వచ్చినా ఇంతవరకు ఫలితం దక్కలేదు.

ఈ ఏడాది అప్పు రూ.27,688.68 కోట్లు

2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ రుణ పరిమితిని రూ.42,472 కోట్లుగా కేంద్రం నిర్ణయించింది. 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన ఫార్ములా ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.10,61,802 కోట్లుగా అంచనా వేశారు. ఈ మేరకు అందులో 4 శాతం నికర రుణ పరిమితిని నిర్దేశించారు. ఈ లెక్కన కొత్త ఆర్థిక సంవత్సరంలో రూ.42,472 కోట్లకు మించి అప్పు తీసుకునేందుకు వీలు లేదు. నికర రుణ పరిమితిలో అన్నింటినీ కలిపి లెక్కిస్తారు. బహిరంగ మార్కెట్‌ రుణాలు, ఆర్థిక సంస్థల నుంచి బేరమాడి తీసుకునే రుణాలు, చిన్నతరహా పొదుపు మొత్తాల రుణాలు, విదేశీ ఆర్థిక సాయం కింద కేంద్రమిచ్చే రుణం, ప్రావిడెంట్‌ ఫండ్‌, చిన్నమొత్తాల పొదుపు, రిజర్వు నిధులు, డిపాజిట్ల రూపంలో వినియోగించుకునే రుణాలన్నీ కలిపి నికర రుణ పరిమితిలోకి వస్తాయి.

తొలుత నిర్ణయించిన రుణ పరిమితిలో కేంద్రం ఆనక కోత పెట్టింది. గతంలో నికర రుణ పరిమితిని దాటి మరీ రాష్ట్రం అప్పులు తీసుకోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆ మేరకు కోత పడింది. దీంతో రుణపరిమితి రూ.27,688 కోట్లకు తగ్గింది. నెలకు ఎంత రుణం తీసుకోవచ్చో లెక్కగట్టి మొదటి 9నెలల కాలానికి రూ.20,751 కోట్ల రుణానికే పరిమితం చేసింది. ఆ పరిమితి ప్రకారం 2 విభాగాలుగా అప్పునకు అనుమతించింది. తొలి 9 నెలల కాలానికి రూ.20,751 కోట్లకే అనుమతించింది. మరో రూ.7,000 కోట్ల రుణం తీసుకునే అవకాశమున్నా అది డిసెంబరు తరువాతే సాధ్యమవుతుంది. పాత అప్పు కోత ఈ ఏడాదికి వద్దని రాష్ట్రం విన్నవించినా ఫలితం దక్కలేదు. మరో వైపు కార్పొరేషన్ల నుంచి మరిన్ని రుణాలను సమీకరించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.

ఇదీ చూడండి: పింఛను ఏ నెలకు ఆ నెలే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.