సీఎం జగన్‌కు అమరావతి రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. మంత్రివర్గ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్తుండగా మందడం వద్ద రైతులు జై అమరావతి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. అమరావతి భూములను విక్రయిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రాజధాని రైతులు తేల్చిచెప్పారు. రేషన్ బియ్యం ఇచ్చేందుకు రూ.4వేల కోట్లతో కొనుగోలు చేసిన వాహనాలు అప్పుడే మూలనపడుతున్నాయని ఆరోపించారు. సంక్షేమ పథకాల పేరుతో డబ్బులను వృథా చేస్తున్నారని.....వాటితో రాజధానిని అభివృద్ధి చేయవచ్చని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ