ETV Bharat / city

285వ రోజుకు అమరావతి ఉద్యమం.. కొనసాగుతున్న దీక్షలు - అమరావతి తాజా వార్తలు

పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు 285వ రోజుకు చేరుకున్నాయి. రాజధాని గ్రామాల్లో మహిళలు, రైతుల నిరసన దీక్షలు కొనసాగించారు. మహిళలు శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు.

amaravati farmers protest
అమరావతి దీక్షలు
author img

By

Published : Sep 27, 2020, 3:45 PM IST

పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు 285వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, బోరుపాలెం, అనంతవరం, వెంకటపాలెం, ఐనవోలు, నీరుకొండ, పెదపరిమి గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తుళ్లూరు,వెలగపూడి, మందడంలో రైతులు నిర్వహించిన దీక్షలో పాల్గొన్నారు.

ఏకాదశి సందర్భంగా కృష్ణాయపాలెం దీక్షా శిబిరంలో రైతులు శ్రీకృష్ణుడికి పూజలు నిర్వహించి గీతాపారాయణం చేశారు. వెంకటపాలెంలో మహిళలు, రైతులు నిరసనను తెలియజేశారు. ఒక్కఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ రాష్ట్ర ప్రజల చెవిలో పువ్వులు పెట్టారంటూ ఆరోపించారు. అన్ని జిల్లాల రైతులు అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారని మహిళలు చెప్పారు. ప్రభుత్వం మారాలన్నారు.

ఇవీ చదవండి:

సైబర్‌ నేరగాళ్ల మోసాల కొత్త పంథా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.