ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు 546వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు, మందడం, అనంతవరం, నెక్కల్లు, వెలగపూడి, బోరుపాలెం, పెదపరిమి, వెంకటపాలెం గ్రామాల్లో రైతులు నిరసనలు కొనసాగించారు. రాజధానిలో 90 శాతం పూర్తైన భవనాలు వినియోగంలోకి తీసుకురావాలని రైతులు డిమాండ్ చేశారు.
రాయపూడి వద్ద వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన సివిల్ సర్వీస్ అధికారుల భవనాలు పూర్తయ్యాయని వాటిని..వినియోగించకుండా వదిలేయడంతో అవి పాడవుతున్నాయన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సివిల్ సర్వీస్ అధికారుల సముదాయం వద్ద నిరసన చేపట్టారు. అందుబాటులో ఉన్న వాటిని వినియోగించకుండా ప్రభుత్వం అద్దె భవనాలలో ఉంటూ కోట్ల ప్రజాధనాన్ని అద్దెల రూపంలో దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీచదవండి