అమరావతినే రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు 573వ రోజు ఆందోళనలు చేపట్టారు. తుళ్లూరు, మందడం, నెక్కల్లు, బోరుపాలెం, కృష్ణాయపాలెం, పెదపరిమి, మోతడక గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా, అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.
తమకు ప్లాట్లు ఇచ్చి నాలుగేళ్లు దాటుతున్నా.. ఇంతవరకూ వాటి అభివృద్ధిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోయారు. తమకు కేటాయించిన ప్లాట్లలో పిచ్చిమొక్కలు వచ్చి ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయని ఆవేదన చెందారు. ఇప్పటికైనా స్పందించి అమరావతిలో తమ ప్లాట్లను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
AP HighCourt: గ్రామ సచివాలయాలపై హైకోర్టు విచారణ.. జీవో 2ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు