ETV Bharat / city

FAREWELL TO HC JUSTICE: ఘన వీడ్కోలు.. హైకోర్టు న్యాయమూర్తికి పూలబాట

FAREWELL TO HC JUSTICE: రాజ‌ధాని అమ‌రావ‌తిపై చరిత్రాత్మక తీర్పునిచ్చిన న్యాయమూర్తులలో ఒకరైన జస్టిస్ సత్యనారాయణ మూర్తి పదవీ విరమణ సందర్భంగా రాజధాని రైతులు ఘనంగా వీడ్కోలు పలికారు. హైకోర్టు నుంచి రాయపూడి సమీపంలోని సీడ్ యాక్సెస్ రహదారి వరకు పూలబాట పరిచారు. న్యాయమూర్తి వచ్చే సమయంలో చేతులు జోడించి ఆయనకు నమస్కరించారు.

FAREWELL TO HC JUSTICE
హైకోర్టు న్యాయమూర్తికి అడుగడుగునా రాజధాని రైతుల నీరాజనం..
author img

By

Published : Jun 14, 2022, 9:00 AM IST

FAREWELL TO HC JUSTICE: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి పదవీ విరమణ సందర్భంగా అమరావతి రాజధాని రైతులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. రాజ‌ధాని అమ‌రావ‌తిపై చరిత్రాత్మక తీర్పునిచ్చిన న్యాయమూర్తులలో సత్యనారాయణ మూర్తి ఒకరు. దీంతో ఆయన పదవి విరమణ సందర్భంగా రైతులు కృతజ్ఞతలు తెలిపారు. హైకోర్టు నుంచి రాయపూడి సమీపంలోని సీడ్ యాక్సెస్ రహదారి వరకు పూలబాట పరిచారు. న్యాయమూర్తి వచ్చే సమయంలో చేతులు జోడించి ఆయనకు నమస్కరించారు. మెడలో ఆకుపచ్చ కండువాలు, చేతిలో జాతీయ జెండాలు పట్టుకుని జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. 'న్యాయస్థానమే దేవస్థానం.. న్యాయమూర్తులు మా దేవుళ్లు' అంటూ.. కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని ఐకాస ఆధ్వర్యంలో పూలవర్షం కురిపించారు. ఎప్పటికీ ఆయన తమ మనసులో చిరస్థాయిగా నిలిచి ఉంటారని పదవీ విరమణ అనంతరం ఆయన శేష జీవితం సుఖ సంతోషాలతో ఆనందమయంగా సాగాలని రైతులు ఆకాంక్షించారు.

హైకోర్టు న్యాయమూర్తికి అడుగడుగునా రాజధాని రైతుల నీరాజనం..

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం మార్చి 3వ తేదిన తీర్పు ఇచ్చింది. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది. సీఆర్​డీఏ చ‌ట్టంలోని సెక్షన్‌ 3 ప్రకారం రాజ‌ధానిని మార్చడం, విభ‌జించ‌డం, హెచ్​ఓడీల మార్పుపై చ‌ట్టం చేసే అధికారం శాస‌న‌స‌భ‌కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు వల్లే తాము ఇప్పుడు ప్రశాంతంగా ఉంటున్నామని రాజధాని రైతులు స్పష్టం చేశారు. హైకోర్టుకు, చారిత్రక తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజధాని గ్రామాలకు చెందిన రైతులు, రైతు కూలీలు, మహిళలు చిన్నారులు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని చేతులు జోడించి న్యాయమూర్తికి ప్రణమిల్లారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.