Amaravathi JAC Released Calendar: రాజధాని రైతుల మహా పాదయాత్ర క్యాలెండర్-2022ను అమరావతి పరిరక్షణ సమితి నేతలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, ఐకాస నేతలు పాల్గొన్నారు. రాజధాని అమరావతి విషయంలో సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలు తీసుకొని అభాసుపాలవుతున్నారని ఐకాస నేతలు మండిపడ్డారు.
సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలు సహేతకమైనవి కావని హితవు పలికారు. అమరావతి మాస్టార్ ప్లాన్ ప్రకారం రాజధాని నిర్మాణం చేయాలని నేతలు డిమాండ్ చేశారు. అమరావతిపై అధికార పార్టీ నేతలు దుష్ప్రచారం చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల అన్ని వర్గాల ప్రజలు నష్టపోతున్నారన్నారు.
అమరావతి ఉద్యమాన్ని అన్ని జిల్లాల్లో మరింత ఉధృతం చేస్తామని ఐకాస నేతలు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలంతా రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతున్నారన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా మూడు రాజధానుల పేరిట ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
అధికారంలో ఉన్నవారు ప్రాంతీయ విద్వేషాలకు పాల్పడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. జగన్ స్పష్టమైన ప్రకటన చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి :
AMARAVATI FARMERS: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమరావతి రైతులు