ETV Bharat / city

Amaravathi Protest: ప్రభంజనంలా అమరావతి రైతుల మహా పాదయాత్ర..అడుగడుగునా జన నీరాజనం - అమరావతి రైతుల మహా పాదయాత్ర న్యూస్

జనం జనం కలిస్తే ప్రభంజనం అన్నట్లుగా అమరావతి రైతుల మహాపాదయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. ప్రకాశం జిల్లాలో ఎక్కడికక్కడ ప్రజలు ఎదురేగి రైతులకు నీరాజనాలు పలికారు. ప్రభుత్వం మూడు ముక్కలాట మాని ..రైతుల ఆకాంక్షను గౌరవించాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ప్రభంజనంలా అమరావతి రైతుల మహా పాదయాత్ర
ప్రభంజనంలా అమరావతి రైతుల మహా పాదయాత్ర
author img

By

Published : Nov 14, 2021, 7:17 PM IST

Updated : Nov 14, 2021, 8:29 PM IST

ప్రభంజనంలా అమరావతి రైతుల మహా పాదయాత్ర

న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర (Amaravathi Farmers Maha Padayatra) ప్రకాశం జిల్లాలో ప్రభంజనంలా సాగుతోంది. 14వ రోజు టంగుటూరు మండలం యరజర్ల శివారు నుంచి ప్రారంభమైన యాత్ర ఎం.నిడమనూరు వరకు 13 కిలోమీటర్ల మేర సాగింది. ఎక్కడికక్కడ మేళ తాళాలు, నృత్యాలతో రైతులకు పూలబాట పరచి గ్రామాల్లోకి ఆహ్వానించారు. జనం స్పందన తమ అలసటను దూరం చేసిందన్న రైతులు.. ఇకపైనా రెట్టించిన ఉత్సాహంతో అడుగులేస్తామని తేల్చి చెప్పారు. ప్రజాప్రతినిధులుగా ఉండాల్సిన మంత్రులు విచక్షణ మరిచి రైతులపై అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

కందులూరులో దారి వెంట కిలోమీటర్ మేర పూలు పరిచి అమరావతి రైతులను ప్రజలు ఆహ్వానించారు. దీన్ని చూసి అన్నదాతలు సంతోషం వ్యక్తం చేశారు. పాదయాత్ర విజయవంతం అవుతుందో కాదో అన్న మీమాంశ పటాపంచలైందన్న రైతులు.. జనం నుంచి వస్తున్న స్పందన మరువలేమన్నారు. ఉద్యమాన్ని హేళన చేసేలా వ్యవహరించే వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రేపటి నుంచి రాజధాని అమరావతి వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ ప్రారంభం కానుండగా...న్యాయ పోరాటంలో విజయం సాధిస్తామని ఐకాస నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. పాదయాత్రకు ప్రకాశం జిల్లా వాసులు, రైతులతో పాటు వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత మద్దతు పలికారు. కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు.

మహా పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రాంతాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఓకే రాజధాని ఉండాలని కోరుకుంటున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రైతులు పట్టుదలతో పాదయాత్రలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం మెుద్దు నిద్ర వీడి ఇకనైనా మూడు రాజధానుల నిర్ణయంపై పునరాలోచించాలి. ప్రజాభీష్టం మేరకు ఒకే రాజధానిగా అమరావతిని కొనసాగించాలి. లేదంటే ప్రజాగ్రహనికి గురికాక తప్పదు. - డోలా బాల వీరాంజనేయస్వామి, కొండపి ఎమ్మెల్యే

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సాగిన రైతుల పాదయాత్ర ఎం. నిడమానూరులో ముగిసింది. రైతులు ఇవాళ రాత్రి అక్కడే బస చేసి రేపటి నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభించనున్నారు.

రేపటి నుంచి అమరావతి వ్యాజ్యాల విచారణ..

సోమవారం నుంచి హైకోర్టులో(AP High Court) రాజధాని అమరావతి కేసుల (Amaravathi capital cases) విచారణ జరగనుంది. హైకోర్టు సీజే (High Court Chief Justice) నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేసుల విచారణ జరపనుంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ (CRDA) రద్దును సవాలు చేస్తూ గతంలో రాజధాని రైతులు దాఖలు చేసిన పిటిషన్లను హైబ్రీడ్‌ విధానంలో విచారించనున్నారు.

సంబంధిత కథనాలు

MAHAPADAYATRA: 14వ రోజూ ఉత్సాహంగా.. అమరావతి మహాపాదయాత్ర

Amaravathi Farmers: అమరావతిపై ప్రభుత్వం మెద్దు నిద్ర వీడాలి: ఐకాస నేతలు

AMARAVATHI CASES: సోమవారం నుంచి హైకోర్టులో రాజధాని కేసుల విచారణ

Last Updated : Nov 14, 2021, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.