ETV Bharat / city

'రాజధాని అంశంపై మోదీని కలవాలనుకుంటున్నాం' - amaravathi land puling news

అమరావతి రాజధాని నిర్మాణంపై రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. రాజధానిపై రోజుకో ప్రకటన తీరును చూసి రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించి... రాజధాని నిర్మాణం - అభివృద్ధిపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని రాజధాని పరిధిలోని రైతులు డిమాండ్ చేశారు.

amaravathi farmers want to meet prime minister modi
amaravathi farmers want to meet prime minister modi
author img

By

Published : Dec 17, 2019, 11:14 PM IST

'రాజధాని అంశంపై ప్రధాన మంత్రిని కలవాలి'

రాజధాని అమరావతి కోసం శంకుస్థాపన జరిగి ఏళ్లు గడిచినా అభివృద్ధి మాత్రం జరగలేదని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణం కోసం రైతులందరూ ప్రధాని మోదీని కలిసేందుకు సిద్ధమయ్యారు. అన్ని పార్టీల నేతలను కలసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. అందులో భాగంగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్​ను కలిసి.. రాజధాని కోసం పార్లమెంటులో తమ గొంతును వినిపించాలని కోరారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించినా.. అవకాశం లభించడం లేదని రైతులు తెలిపారు.

'రాజధాని అంశంపై ప్రధాన మంత్రిని కలవాలి'

రాజధాని అమరావతి కోసం శంకుస్థాపన జరిగి ఏళ్లు గడిచినా అభివృద్ధి మాత్రం జరగలేదని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణం కోసం రైతులందరూ ప్రధాని మోదీని కలిసేందుకు సిద్ధమయ్యారు. అన్ని పార్టీల నేతలను కలసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. అందులో భాగంగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్​ను కలిసి.. రాజధాని కోసం పార్లమెంటులో తమ గొంతును వినిపించాలని కోరారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించినా.. అవకాశం లభించడం లేదని రైతులు తెలిపారు.

ఇదీ చదవండి:

రాష్ట్రానికి 3 రాజధానులు.. ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు

Intro:ఈశ్వరాచారి..... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్.... అమరావతి రాజధాని నిర్మాణం పై రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. రాజధాని పై రోజుకి ఒక ప్రకటన ఇస్తున్న రాష్ట్ర మంత్రుల తీరును చూసి రైతులు మరింత ఆందోళనకు గురౌతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ.... రాజధాని నిర్మాణం - అభివృద్ధి పై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని రాజధాని రైతులు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రధానమంత్రి మోడీ కి దగ్గర కి వెళ్లేందుకు రాజధాని రైతులు సంసిద్ధమౌతున్నారు. తమ సమస్యలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లాలని తమ గొంతును పార్లమెంట్లో వినిపించాలని రాజధాని రైతులు కోరారు .... look....

V.O.1 : ఏపీ రాజధాని అమరావతి కోసం ఉద్దండరాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన జరిగి ఏళ్ళు గడిచిన అభివృద్ధి మాత్రం జరగలేదని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద రైతుల నుంచి 33 వేల ఎకరాల భూమిని సేకరించారు. రాబోయే రోజుల్లో తమ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన రైతులకు చుక్క ఎదురైంది. ప్రస్తుత పరిస్థితుల్లో నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చగా తమ భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన రైతులకు 10 ఏళ్ళు వరకు నష్టపరిహారం చెల్లిస్తూ ,ప్రతి సంవత్సరం10 శాతం పెంచుతామని గత ప్రభుత్వం వాగ్దానం చేసింది. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం రాజధాని పై రోజుకో ప్రకటన చేస్తుందని రైతులు ఆగ్రహం చేస్తున్నారు. రాజధాని నిర్మణం పై రాష్ట్ర ప్రభుత్వం సృష్టమైన హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
బైట్.... ఆలూరి శ్రీనివాసరావు, రాజధాని రైతు
బైట్.... లంక సుధాకర్, వెంకటపాలెం

V.O.2. : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రైతులందరు ప్రధాని మోడీ ని కలిసేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా అన్ని పార్టీల నేతలను కలసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అందులో భాగంగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ని కలసి.... రాజధాని రైతులు రాజధాని కోసం పార్లమెంటు లో తమ గొంతును వినిపించమని కోరారు. రాజధాని శంకుస్థాపనలో పాల్గొని మట్టి నీరు ఇచ్చిన ప్రధాని మోదీ తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై అన్ని పార్టీల నేతలను కలుపుని పోతామని రైతులు చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని నిర్మాణంపై సభ ముఖంగా ఓ ప్రకటన జారీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రాజధాని అంశంపై తన వంతు కృషి చేస్తానని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు.
బైట్.... గుర్రం నాగేశ్వరరావు, రాజధాని రైతు
బైట్.... గల్లా జయదేవ్, గుంటూరు ఎంపీ

E.O. : రాజధాని నిర్మాణం - అభివృద్ధి పై రాష్ట్ర మంత్రులు రోజుకో ప్రకటన చేస్తూ రైతులను అయోమయానికి గురిచేసురున్నారని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే రాజధాని నిర్మాణం పై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన హామీ ఇవ్వాలని రాజధాని రైతులు కోరుతున్నారు.


Body:బైట్స్...


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.