పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు 359వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు, వెలగపూడి, మందడం, కృష్ణాయపాలెం, ఉద్ధండరాయునిపాలెం, దొండపాడు, పెదపరిమి గ్రామాల్లో రైతులు నిరసనలు కొనసాగించారు.
ఈనెల 6న ఉద్ధండరాయుని పాలెంలో రైతులపై దాడి చేసిన ఘటనలో తమ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ మహిళలు, అన్నదాతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. దీక్షా శిబిరం వద్ద మోకాళ్లపై నిల్చొని నిరసన గళాన్ని వినిపించారు. ఉద్యమం ప్రారంభించి దాదాపు ఏడాది పూర్తవుతున్నా...ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడాన్ని రైతులు తప్పు పట్టారు. ప్రభుత్వం దిగొచ్చేంతవరకు ఆందోళనకు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇదీచదవండి