అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, మహిళలు 390వ రోజు ఆందోళన చేపట్టారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, దొండపాడు, బోరుపాలెం, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, పెదపరిమిలో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు.
శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామిని అడ్డుకున్న పోలీసులు
రాజధానిలో ఆందోళన చేస్తున్న రైతులు, మహిళలకు మద్దతు తెలిపేందుకు వస్తున్న తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామిని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా రాజధానిలో పర్యటించవద్దని ఆంక్షలు విధించారు. వెంకటపాలెం, కృష్ణాయపాలెంలోనే పర్యటించాలని, మందడంలో పర్యటించడానికి వీల్లేదని షరతులు విధించారు. పోలీసుల నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే మందడంలో పర్యటించాలని ఆంక్షలు విధించారు.
మందడంకు వెళ్లి తీరతా
పోలీసులు అనుమతి ఇచ్చినా.. ఇవ్వకపోయినా సోమవారం మందడంలో పర్యటించి తీరుతానని శివస్వామి స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతినే కొనసాగించేలా పాలకుల మనస్సు మారాలంటూ ఈనెల 18 నుంచి ఉద్ధండరాయునిపాలెంలో శ్రీవిద్యామహాయాగం నిర్వహిస్తున్నట్లు శివస్వామి చెప్పారు.
ఇదీ చదవండి: సంక్రాంతి సందడి వచ్చేసింది..!