ETV Bharat / city

ఆగని అమరావతి రైతుల నిరసనలు.. 379వ రోజుకు చేరిన ఆందోళనలు - amaravathi farmers darna

అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలే తప్ప రాజధానులు విభజించడం సరికాదని.. రాష్ట్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. అమరావతే రాజధానిగా కొనసాగాలని రైతులు చేపట్టిన దీక్ష 379వ రోజు చేరింది. రైతులు నిరసన దీక్షకు ఆయన మద్దతు ప్రకటించారు.

amaravathi farmers protest
ఆగని అమరావతి రైతుల నిరసనలు.. 379వ రోజు కొనసాగుతున్న ఆందోళనలు
author img

By

Published : Dec 30, 2020, 7:44 PM IST

అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలే తప్ప రాజధానులు విభజించడం సరికాదని.. రాష్ట్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళన 379వ రోజుకు చేరింది. ఈ దీక్షకు ఆయన మద్దతు ప్రకటించారు. మందడం, వెలగపూడి, తుళ్లూరు, వెంకటపాలెంలోని దీక్షా శిబిరాలలో రైతులతో కలిసి అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. గత ప్రభుత్వం అమరావతిలో లక్షకోట్ల సంపద సృష్టించారని.. వాటితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవచ్చని చలసాని అన్నారు. కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని ఆరోపించారు.

రాజధాని కోసం సుమారు 110మందికిపైగా ప్రాణాలొదిలితే.. సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాజధానిని శ్మశానంతో పోల్చిన నేతలు.. ఈ ప్రాంతంలో పేదలకు భూములు ఎలా ఇస్తారని నిలదీశారు.

ఆగని అమరావతి రైతుల నిరసనలు.. 379వ రోజుకు చేరిన ఆందోళనలు

ఇదీ చదవండి:

జీవో 77ను రద్దు చేయండి.. సీఎంకు సోము వీర్రాజు లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.