అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో పెద్దఎత్తున కుట్ర జరుగుతుందని రాజధాని రైతులు, మహిళలు ప్రధాని మోదీకి లేఖ రాశారు. అవసరాలకు భూమి అమ్మినా.. సిట్, సీఐడీ, సబ్ కమిటీ పేర్లతో వేధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమతో జరిగిన న్యాయబద్ధమైన ఒప్పందాన్ని ప్రభుత్వం గౌరవించడం లేదని లేఖలో ప్రస్తావించారు.
కడపలో సీఎం కుమార్తె పేరుతో కొన్న భూములూ ఇన్‌సైడర్ ట్రేడింగేనా? అన్న అనుమానం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల పేరుతో రాష్ట్రంలో పెద్దఎత్తున దందా జరుగుతుందని ఆరోపించారు. భారీ కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే తమపై అవినీతి ముద్ర వేస్తున్నారని ప్రధానికి రాసిన లేఖలో రైతులు తెలిపారు.
ఇదీ చదవండి: 17 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్