పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. రైతులు, మహిళలు 655వ రోజూ నిరసనలు చేపట్టారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, దొండపాడు, నెక్కల్లు, పెదపరిమి, మోతడక, అనంతవరం గ్రామాల్లో రైతులు దీక్షలు కొనసాగించారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీ చిత్రపటాలతో ఆందోళన చేశారు. మందడం, మోతడక, దొండపాడులో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రక్తం చిందించకుండా దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన గాంధీ మహాత్ముడి మార్గంలో పయనించి అమరావతిని సాధించుకుంటామని రైతులు స్పష్టం చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై వైకాపా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీచదవండి.