ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు 546వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా కౌలు బకాయిలు చెల్లించడంలో జాప్యం చేస్తోందంటూ... రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రైతులకు సీఆర్డీఏ చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మందడం రైతులు న్యాయస్థానాన్ని కోరారు. రైతులకు కౌలు చెల్లించటంలో సీఆర్డీఏ ఆలస్యం చేసిందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. పిటిషనల్ తరఫున న్యాయవాది ఇంద్రనీల్ వాదనలు వినిపించనున్నారు.
హైకోర్టులో రాజధాని రైతుల పిటిషన్ - farmers filed a soot in high court
మందడం గ్రామానికి చెందిన రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఆర్డీఏ చెల్లించాల్సిన వార్షిక కౌలు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.