ETV Bharat / city

"రాజధానిపై నిపుణుల కమిటీ ఏర్పాటు చట్టవిరుద్ధం" - pill on capital city amaravathi

రాజధాని అమరావతితో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై సిఫారసులు చేసేందుకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీని సవాల్ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. రాజధాని ప్రణాళికలను పునఃపరిశీలించే అధికారం కమిటీకి లేదని సీఆర్డీఏ చట్ట నిబంధనలకు విరుద్ధంగా కమిటీని ఏర్పాటు చేశారంటూ న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు కాగా ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది.

నిపుణుల కమిటీ చట్టవిరుద్ధం
author img

By

Published : Nov 14, 2019, 7:04 AM IST

రాజధాని అమరావతితో పాటు రాష్ట్రాభివృద్ధిపై సర్కారు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీని సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. కమిటీ ఏర్పాటుకు సంబంధించి సెప్టెంబర్ 13న జారీ చేసిన జీవో 585ను రద్దు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా బోరుపాలెం గ్రామానికి చెందిన శివలింగయ్య, రామారావు వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కమిటీ ఏర్పాటు ఏపీ సీఆర్డీఏ చట్ట నిబంధనలకు విరుద్ధమని... రాజధాని ప్రణాళికలను పునఃపరిశీలించే అధికారం ప్రభుత్వం నియమించిన కమిటీకి లేదని అందులో పేర్కొన్నారు.
29 గ్రామాలపై ప్రభావం
రాజధాని ప్రణాళికలపై కమిటీ సమీక్షిస్తే 29 గ్రామాల ప్రజల హక్కులపై ప్రభావం పడుతుందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ అంశాల్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ జీవోను రద్దు చేయాలని కోరారు. నిపుణుల కమిటీని రాజధాని నిర్మాణ వ్యవహాహంలో సీర్డీఏ ప్రణాళికలపై పునఃసమీక్షించకుండా నిలువరించాలని పిటిషన్​దారులు కోరారు.
అమరావతిలో పనులు కొనసాగాలి
ఎలాంటి కారణాలు చూపకుండా అర్ధాంతరంగా అమరావతిలో నిర్మాణ పనుల్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిలిపేశారని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఇప్పటికే 30వేల కోట్లు ఖర్చు అయిన విషయాన్ని ప్రస్తావించారు. రాజధానిని మరో ప్రాంతానికి తరలిస్తే ఆ సొమ్మంతా వృథా అవుతుందని వివరించారు. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు తక్షణమే పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రతివాదులుగా మంత్రులు, కమిటీ సభ్యులు
ప్రస్తుత ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపిస్తోందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఆర్డీఏ కమిషనర్, పురపాలక, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు సహా మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నిపుణుల కమిటీ కన్వీనర్ జీఎన్ రావు, కమిటీ సభ్యులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యం ఈ రోజు హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరికొంత మంది రైతులు కూడా ఇదే వ్యవహారంపై హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలు చేశారు.

ఇదీ చదవండి: కావాలి ఉచిత ఇసుక... పోవాలి ఇసుక మాఫియా..!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.