అమరావతి ప్రాంతంలో రైతుల నిరసనలు 64వరోజుకు చేరుకున్నాయి. రైతులు చేస్తున్న దీక్షకు ఎన్నారైలు, జాతీయ రైతు సంఘాల నేతలు మద్దతు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్ధి సంఘాల నేతలు రాజధాని గ్రామాల్లో పర్యటించారు. రైతు ఉద్యామానికి తమ సంఘీభావాన్ని తెలిపారు. 63 రోజుల నుంచి నిరాటంకంగా మందడం,తుళ్లూరు,వెలగపూడి ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. కృష్ణాయపాలెం,రాయపూడి,వెంకయ్యపాలెం పలు ప్రాంతాల్లో రైతులు దీక్షలను కొనసాగిస్తున్నారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించేవరకు ఉద్యమం చేస్తామంటున్నారు. ప్రభుత్వం రైతుల పట్ల ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ తీరు మారేంత వరకూ పోరు ఆపేదిలేదని రైతులు తెల్చి చెబుతున్నారు. జై అమరావతి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఇదీ చదవండి : 'వారికి ముప్పు వాటిల్లితే.. వైకాపా ప్రభుత్వానిదే బాధ్యత'