ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్​: నెలాఖరు వరకు రవాణా వ్యవస్థ బంద్​ - TRAINS CANCELLED IN TELANGANA

కరోనా ప్రభావంతో భారతీయ రైల్వే అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రయాణికుల రైళ్లను మార్చి 31 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కోల్​కతా మెట్రో, కొంకణ్ రైల్వే, ముంబయి సబర్బన్ ఇలా అన్ని రైళ్ల సర్వీసులను నిలిపేస్తున్నట్లు పేర్కొంది. ఆర్టీసీ, మెట్రో రైళ్ల రద్దును పొడిగిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

all-transport-remain-shutdown
all-transport-remain-shutdown
author img

By

Published : Mar 23, 2020, 8:18 AM IST

కరోనా ఎఫెక్ట్​: నెలాఖరు వరకు రవాణా వ్యవస్థ బంద్​

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా అన్ని రైళ్లను రద్దు చేసినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. ఈ నిర్ణయం అమలులో భాగంగా.. మార్చి 31 అర్ధరాత్రి వరకు అన్ని ప్యాసింజర్, ఎక్స్​ప్రెస్, మెయిల్​, సబర్బన్, డెమో, ఇంటర్ సిటీ ఎక్స్​ప్రెస్, ఎంఎంటీఎస్, ఇతర ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

అందుబాటులో ఐఆర్​సీటీసీ..

సాధారణ టికెట్ బుకింగ్ కౌంటర్లు, రిజర్వేషన్ కౌంటర్లు, పార్సిల్​ కౌంటర్లు, తినుబండారాల విక్రయాలు.. వాటికి సంబంధించిన స్టాళ్లవంటివన్నీ మూసివేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రైళ్లు రద్దు చేయడం వల్ల యూటీఎస్ చరవాణి యాప్ పనిచేయదని.. కేవలం ఐఆర్​సీటీసీ పోర్టల్, అప్లికేషన్​ మాత్రమే పనిచేస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్ రిజర్వేషన్ల కోసమే అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రీఫండ్ విషయంలో ప్రయాణికులు చింతించాల్సిన అవసరంలేదని జూన్ 21 వరకు నగదు తీసుకునే వెసులుబాటు కల్పించామని రైల్వే అధికారులు వెల్లడించారు. సరకు రవాణా రైళ్లు (గూడ్స్) మాత్రం యథావిధిగా నడుస్తాయని చెప్పారు.

ఏ వాహనాలూ నడవకూడదు..

తెలంగాణలో ఆర్టీసీ బస్సులను డిపోలకే పరిమితం చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటితో పాటు ప్రైవేటు బస్సులనూ నిలిపివేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆటోలు, క్యాబ్​లు, ప్రైవేట్ వాహనాలకూ అనుమతిలేదన్నారు. రవాణా వ్యవస్థను స్తంభింపజేయడం ద్వారా.. ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమవుతారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మెట్రో రైళ్ల రద్దును ఈనెల 31 వరకు పొడిగించినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్​ రెడ్డి తెలిపారు.

ఇవీ చూడండి:

ఈనెల 31 వరకు ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావొద్దు: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.