ETV Bharat / city

TRS Plenary: తెరాస పండుగకు సర్వం సిద్ధం.. భాగ్యనగరమంతా గులాబీమయం - తెరాస 21వ వ్యవస్థాపక దినోత్సవం

TRS Plenary: గులాబీ పండగకు సర్వం సిద్ధమైంది. తెరాస 21వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. మూడు వేల మంది పార్టీ ప్రతినిధులు హాజరు కానున్నారు. అభివృద్ధి, సంక్షేమం, రాజకీయాలకు సంబంధించి... రాష్ట్ర, జాతీయ అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జెండా పండగ జరపాలని.. తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్​ పిలుపునిచ్చారు. ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ గులాబీమయంగా మారింది.

1
1
author img

By

Published : Apr 27, 2022, 8:07 AM IST

తెరాస పండుగకు సర్వం సిద్ధం.. భాగ్యనగరమంతా గులాబీమయం

TRS Plenary: ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి... సుమారు ఎనిమిదేళ్లు నిరాటంకంగా పాలన కొనసాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. యవ్వన దశకు చేరింది. తెరాస 21వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఇవాళ హైదరాబాద్‌లోని హెచ్​ఐసీసీలో ఘనంగా జరిపేందుకు సర్వంసిద్ధమైంది. గతేడాది ఏప్రిల్‌లో జరగాల్సిన ద్విదశాబ్ది ప్లీనరీ... కరోనా పరిస్థితుల వల్ల అక్టోబరులో నిర్వహించారు. ఆరు నెలల వ్యవధిలోనే మరోసారి ప్లీనరీ నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల మంది తెరాస ప్రతినిధులు ప్లీనరీకి హాజరుకానున్నారు. సభ చుట్టూ ఎనిమిది పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎల్ఈడీ స్క్రీన్‌తో కూడిన భారీ వేదికను ఏర్పాటు చేశారు. ఉద్యమం, పాలనపరమైన కీలక ఘట్టాలను స్క్రీన్ పై ప్రదర్శిస్తారు.

ఉదయం 10 గంటలకల్లా ప్రతినిధులు హెచ్​ఐసీసీకి చేరుకుంటారు. ఉదయం 11 వరకు ప్రతినిధుల నమోదు కార్యక్రమం ఉంటుంది. 11 గంటల 5 నిమిషాలకు తెరాస అధ్యక్షుడు కేసీఆర్... వేదికపై అమరవీరులకు నివాళి అర్పిస్తారు. తెలంగాణ తల్లికి పూలమాల వేసి.. తెరాస జెండాను ఆవిష్కరిస్తారు. కేసీఆర్ స్వాగతోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. 21 ఏళ్ల ప్రస్థానంతోపాటు... ఎనిమిదేళ్ల తెరాస పాలనలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ కేసీఆర్ ప్రసంగం కొనసాగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం, భాజపాపై విరుచుపడనున్నట్ల తెలుస్తోంది. కేసీఆర్ జీవిత విశేషాలు, ఉద్యమ చరిత్ర, అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించే ఫోటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ప్లీనరీలో 11 అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్లీనరీ ముగుస్తుంది.

తెరాస వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా.... పార్టీ శ్రేణులకు.... కేసీఆర్ ఏమి దిశానిర్దేశం చేయబోతున్నారనే ఆసక్తి రాజకీయవర్గాల్లో నెలకొంది. జాతీయస్థాయిలో క్రియాశీలక పాత్ర పోషించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో..... ఎలా ముందుకెళ్లనున్నారనే అంశంపై స్పష్టతనిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సిద్ధం చేయడంతోపాటు.. రాష్ట్ర ప్రజల్లో ఉత్సాహం, ఆశలు కలిగించేలా..... అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా తెరాస జెండా పండగ జరపనున్నారు.

సుమారు ఆరు వేల మందికి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నేతృత్వంలో 33 తెలంగాణ వంటకాలతో భోజనాలను సిద్ధం చేస్తున్నారు. తెరాస ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ గులాబీమయంగా మారింది. భాగ్యనగర నేతలు.... హెచ్ఐసీసీ పరిసరాలతోపాటు.. పలు కూడళ్లలో భారీగా గులాబీ జెండా తోరణాలు, కేసీఆర్, కేటీఆర్ కటౌట్లు, ఫ్లెక్సీలతో నింపేశారు.

తెరాస వ్యవస్థాపక దినోత్సవ సంబురాలు అర్ధరాత్రి నుంచే ప్రారంభమయ్యాయి. ప్రగతిభవన్ ఎదుట బాణాసంచా పేల్చి వేడుకలు జరుపుకున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో రాత్రి 12 గంటల కేక్ కోశారు. అటు... తెరాస ప్లీనరీ కోసం పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 2500 మందితో బందోబస్తు నిర్వహించనున్నారు. హెచ్​ఐసీసీలో ఉన్న 200 సీసీ కెమెరాలను సైబరాబాద్‌ కమాంట్‌ కంట్రోల్‌కు అనుసంధానం చేశారు. తెరాస ప్లీనరీ సందర్భంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు మార్గాల్లో ఆంక్షలు విధించారు. వాహనదారులందరూ ట్రాఫిక్‌ ఆంక్షలు పాటించి సహకరించాలని పోలీసులు అధికారులు కోరారు.

ఇదీ చూడండి: నేడు పార్టీ నేతలతో జగన్‌ కీలక భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.