ఆస్తుల రిజిస్ట్రేషన్లన్నీ ఇక గ్రామ/వార్డు సచివాలయాల్లోనే జరగనున్నాయి. అక్కడుండే పంచాయతీ కార్యదర్శులే సబ్ రిజిస్ట్రార్ విధులను నిర్వహించనున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో ఈ మేరకు పైలట్ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్కడి పంచాయతీ కార్యదర్శి సబ్‌రిజిస్ట్రార్ విధుల్ని నిర్వహిస్తారు. సహాయ సబ్‌రిజిస్ట్రార్‌గా డిజిటల్ అసిస్టెంట్ వ్యవహరిస్తారని రెవెన్యూ (రిజిస్ట్రేషన్) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీచేశారు. గ్రామ పరిధిలోని దస్తావేజుల రిజిస్ట్రేషన్, ఇతర అనుబంధ సేవలను వీరే చూస్తారన్నారు.
ఇదీ చదవండి: