నిర్మాణంలో ఉన్న స్మృతివనాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయం విజయవాడకు కూత వేటు దూరంలో ఉన్నా.. సీఎం జగన్ ఆన్లైన్ ద్వారా శంకుస్థాపన చేయడం అంబేడ్కర్‌ను కించపర్చడమే అన్నారు. 125 జయంతి ఉత్సవాల సందర్భంగా అంబేడ్కర్ స్మృతివనం ఎక్కడైతే ఏర్పాటు చేశారో అక్కడే నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉద్దేశ్యమేంటి..?
వైకాపా అధికారంలో వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అరాచకాలు, అవినీతి పెరిగిపోయిందని మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శించారు. సీఎం అనాలోచిత నిర్ణయాల వల్ల.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా..? లేదా..? అనే ప్రశ్న ఉద్భవిస్తుందన్నారు. 30 శాతం పనులు పూర్తి చేసుకున్న అంబేద్కర్ విగ్రహం తరలించడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటని ఆయన ప్రశ్నించారు.
ఉపసంహరించుకోవాలి ...
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. 3 రాజధానులు నిర్ణయం, స్మృతివనం నుంచి విజయవాడకు అంబేడ్కర్ విగ్రహం తరలింపు సరైన నిర్ణయాలు కావన్నారు. ప్రభుత్వం వెంటనే విగ్రహం తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు.
ఇదీ చదవండి :