తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అఖిల భారత గంగపుత్ర మహాసభ నేతలు పర్యటించారు. మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు బెస్త అక్కడి ఫిషింగ్ యార్డుల్లో చేపలు, రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లను సందర్శించారు. తయారీ విధానం, నిల్వ ఉంచే పద్ధతులు, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే విధానాలను గురించి చేపల ప్రాసెసింగ్ నిపుణులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రాలో మత్స్యకారులకు అందుతున్న పథకాల గురించి వారికి తెలియజేశారు. త్వరలో మరిన్ని రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను తెలుసుకుంటామని వెంకటేశ్వర్లు బెస్త తెలిపారు. మత్స్యకారులకు తాము ఎప్పుడు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రకటించారు.
ఇదీ చదవండీ.. తలలు పగిలేలా మొక్కులు.. అంతా భక్తిలో భాగమే!