స్థానిక పరిస్థితుల మేరకు రైతులకు ఎరువులు పంపిణీ చేస్తున్నామని.. వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ చెప్పారు. ఆర్‌బీకేల్లో ఎరువుల కొరత అంశంపై ఆయన స్పందించారు. రాష్ట్రంలో ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయన్న ఆయన.. ఇప్పటి వరకు 15.53 లక్షల టన్నుల ఎరువులు పంపిణీ చేశామన్నారు.
ఆర్‌బీకేల్లో ఇంకా 4.82 లక్షల టన్నుల ఎరువులు నిల్వ ఉన్నట్లు చెప్పారు. ఎక్కడా అక్రమంగా నిల్వ చేయకుండా సామాజిక తనిఖీలు చేస్తున్నామన్నారు. ధర పెంచి విక్రయించడం, నల్లబజారుకు తరలించడాన్ని అరికట్టామన్న కమిషనర్.. రైతుభరోసా కేంద్రాల్లో ఇండెంట్ ప్రకారమే ఎరువులు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: కొత్త జిల్లాల్లో.. ఉగాది నుంచే పాలన..!