తెలంగాణలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయం పునర్నిర్మాణంలో భాగంగా విద్యుత్తు వెలుగులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రాల్లో ఏ ఆలయంలో లేని విధంగా సరికొత్త విద్యుద్దీపాలు అమర్చేందుకు యాడా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రష్యన్ సాంకేతిక నైపుణ్యంతో బెంగళూరులోని లైటింగ్ టెక్నాలజీ అనే సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.
దీపం వెలుతురు మాదిరిగా పసుపు రంగులో విద్యుద్దీపం వెలుగులు వస్తాయని యాడా అధికారులు తెలిపారు. ‘గంటలో విద్యుద్దీపం’ నమూనాలో బల్బులను తయారు చేయిస్తున్నారు. వీటిని ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి పర్యవేక్షణలో అమర్చుతున్నట్లు వారు వెల్లడించారు. సెన్సార్‌తో వెలిగే ఈ దీపాలను ప్రస్తుతం ఆలయం లోపల శిల్పాలు ఉన్న స్తంభాలకు బిగించారు. వెలుపల పనులు జరుగుతున్నాయి. రాత్రి పూట భక్తులకు శిల్పాలు స్పష్టంగా కనిపించేందుకు వీటిని బిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
- ఇదీ చూడండి :
- రంగురంగుల గుడారాలు.. గోవాలో కాదు మన విశాఖ బీచ్‌లోనే