సమత హత్యాచార కేసులో నిందితులకు ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు మరణ శిక్ష విధించింది. షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మఖ్దూంను దోషులుగా తేల్చిన ప్రత్యేక కోర్టు... వారిని ఉరి తీయాలని తీర్పు వెల్లడించింది. మొదటి దోషికి రూ.8 వేలు, రెండో, మూడో దోషులకు రూ.9 వేల చొప్పున జరిమానా విధించింది. దోషులు చేసిన నేరాన్ని ఘోరమైందిగా న్యాయమూర్తి అభివర్ణించారు. తన భార్యను అతి కిరాతకంగా అత్యాచారం చేసి చంపిన దోషులకు శిక్ష పడేలా చేసినందుకు... పోలీసులకు సమత భర్త కృతజ్ఞతలు తెలిపారు. సమత కేసులో ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై మహిళా సంఘాలు, పోలీసులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి
'మేము క్షేమంగా ఉన్నాం : చైనాలో తెలుగు విద్యార్థుల సెల్ఫీ వీడియో'