ఈఎస్‌ఐ కేసులో అనిశా అధికారులు మరొకరిని అరెస్ట్ చేసినట్లు అనిశా జేడీ రవికుమార్ తెలిపారు. ఈ కేసులో మొత్తం ఏడుగుని అరెస్ట్ చేసినట్లు వివరించారు.
- రూ. 150 కోట్ల అవినీతి
అరెస్టైన వారందరూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించామని.. దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలుస్తాయని జేడీ తెలిపారు. అచ్చెన్నాయుడు, రమేశ్‌కుమార్ హైకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేసినట్లు సమాచారం అందిందని వెల్లడించారు. తామూ న్యాయప్రక్రియ ప్రకారం ముందుకెళ్తామని స్పష్టం చేశారు. సుమారు రూ.150 కోట్ల అవినీతి జరిగినట్లు ప్రాథమికంగా నిర్థరణ అయ్యిందని.. ప్రైవేటు వ్యక్తులతో అధికారులు కుమ్మకై ప్రభుత్వానికి నష్టం కలిగించారని పేర్కొన్నారు.
- అచ్చెన్నాయుడు సిఫార్సు లేఖలతోనే..
ఇప్పటివరకు ఇందులో 19 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. దీనిపై విచారణ కొనసాగుతోందని వివరించారు. 6 అంశాల్లో ప్రభుత్వానికి నష్టం జరిగినట్లు గుర్తించామని.. రమేశ్ కుమార్, అచ్చెన్నాయుడిని న్యాయమూర్తి ముందు హాజరుపరిచామని చెప్పారు. మరో ఐదుగురిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తున్నామన్నారు. అచ్చెన్నాయుడు సిఫార్సు లేఖలతోనే టెలీహెల్త్ పరికరాలు కొనుగోలు చేసినట్లు వెలుగులోకి వచ్చిందని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి...