కరోనా దృష్ట్యా కేంద్రం నుంచి రాష్ట్రానికి 10 వేల కోట్లు వస్తుంటే.. ప్రతి పేద కుటుంబానికి 5 వేల రూపాయలు ఇచ్చేందుకు సీఎం జగన్‌కి మనసొప్పడం లేదని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. రైతులకు పంట పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు రావడం లేదని మండిపడ్డారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేదలు... అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన రూ. వెయ్యి... ఏ మాత్రం సరిపోవని అభిప్రాయపడ్డారు. కనీసం 5 వేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలంటూ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: