నివర్ బాధితుల పట్ల నిర్లక్ష్యం వీడి.. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని కోరారు. బాధిత ప్రజలకు ఆహారం, తాగునీరు, మందులు సరఫరా చేయాలన్నారు.
అనేక చోట్ల భారీ వృక్షాలు నేలకూలి స్తంభాలు విరిగిపడి.. విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేసి.. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరాను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సన్నాహాలు ప్రజల్ని భయపెడుతున్నాయని ఆరోపించారు. రియల్ టైం గవర్నెన్స్ సాయంతో.. ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించాలని సూచించారు.
ఇదీ చదవండి:
కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డ విద్యార్థులపై ఎన్టీఆర్ వర్సిటీ చర్యలు