కార్మికుల హక్కుల పోరాటానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ హయాంలో 40లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆరోపించారు. అన్న క్యాంటీన్లను మూసివేసి కార్మికుల పొట్టగొట్టారని మండిపడ్డారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి గాలిలో దీపంలా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ రెడ్డి చేతగాని తనం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతోందని, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2లక్షల కోట్ల పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని విమర్శించారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వం కార్మికులకు అండగా నిలచి ఆదుకోవాలని అచ్చెన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: సీఎం అనందం కోసం నన్ను అరెస్టు చేసే అవకాశం ఉంది: దేవినేని