ETV Bharat / city

పలు తహసీల్దార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అనిశా సోదాలు

రాష్ట్రవ్యాప్తంగా పలు తహసీల్దార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయాల్లో అనిశా అధికారులు దస్త్రాలు పరిశీలించారు. కృష్ణా, గుంటూరు, విశాఖ, శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని పలు తహసీల్దార్ కార్యాలయాల్లో అనిశా అధికారులు సోదాలు చేశారు.

acb-raids-at-several-tehsildar-offices-across-the-state
తహసీల్దార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అనిశా సోదాలు
author img

By

Published : Sep 2, 2020, 2:52 PM IST

Updated : Sep 2, 2020, 6:15 PM IST

తహసీల్దార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అనిశా సోదాలు

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌ కార్యాలయంలో అనిశా అధికారులు సోదాలు చేశారు. తహసీల్దార్‌ చంద్రశేఖర్ కారులో రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్ కారులో రూ.లక్ష స్వాధీనం చేసుకున్న అధికారులు... సిబ్బందిని అదుపులోకి తీసుకొని విచారించారు.

అనంతపురం జిల్లా కూడేరు తహసీల్దార్‌ కార్యాలయంలో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు. భూ రికార్డులకు సంబంధించి కంప్యూటర్‌ ఆపరేటర్‌ను అధికారులు ప్రశ్నించారు.

విశాఖ జిల్లా కశింకోట రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. మీసేవ కేంద్రాలకు అనుమతుల విషయమై వచ్చిన ఫిర్యాదు మేరకు సోదాలు నిర్వహించారు. అదనపు ఎస్పీ షకీలా భాను, డీఎస్పీ రంగరాజు ఆధ్వర్యంలో సోదాలు చేశారు. తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులు దస్త్రాలు పరిశీలించారు.

శ్రీకాకుళం జిల్లా సంతకవిటి తహసీల్దార్ కార్యాలయంలో అనిశా అధికారుల సోదాలు నిర్వహించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లా భామిని ఎంపీడీవో కార్యాలయంలో అనిశా సోదాలు జరిపింది. రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఎంపీడీవో నిమ్మల మాసా ఏసీబీకి చిక్కారు.

చిత్తూరు జిల్లా పీలేరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అనిశా అధికారుల సోదాలు నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయంలో అనిశా అధికారులు సోదాలు చేశారు. తహసీల్దార్‌ కార్యాలయంలో రికార్డులు పరిశీంచారు.

గుంటూరు జిల్లా రాజుపాలెం తహసీల్దార్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. తహసీల్దార్‌పై ఇనిమెట్ల రైతుల ఫిర్యాదు మేరకు అధికారులు సోదాలు చేశారు. పట్టదారు పాసు పుస్తకాలు ఇవ్వకుండా తహసీల్దార్ వేధిస్తున్నారని రైతులు ఫిర్యాదు చేశారు.

ఏలూరు రేషన్ బియ్యం గోదాములో విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు. బియ్యం నిల్వలు, రికార్డులు పరిశీలించారు. బియ్యం నిల్వలపై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్‌ అధికారులు సోదాలు నిర్వహించారు.

నెల్లూరు జిల్లా గూడూరు పురపాలక సంఘం కార్యాలయంలో అనిశా అధికారులు సోదాలు చేశారు. పట్టణ ప్రణాళిక విభాగంపై పలు ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను అడిగి వివరాలు సేకరించారు.

విజయనగరం జిల్లా బలిజిపేట తహసీల్దార్ కార్యాలయంలో అనిశా అధికారులు సోదాలు చేశారు. అక్కడి సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారించారు.

ఇదీ చదవండి: ఏపీ హైకోర్టు కీలక తీర్పు.. మద్యం ప్రియులకు ఉపశమనం

Last Updated : Sep 2, 2020, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.