గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్ కుంభకోణంలో సీబీఐ అధికారి ఆర్ఎం ఖాన్ వాంగ్మూలాన్ని.. అనిశా న్యాయస్థానం నమోదు చేసింది. కేసు విచారణను ఈనెల 12కి వాయిదా వేసింది. ఓఎంసీ కేసులో గాలి జనార్ధన్‌రెడ్డి అక్రమంగా బెయిల్ పొందారన్న అభియోగంపై అనిశా కోర్టు విచారణ జరుపుతోంది.
ఈ విషయమై అనిశాకు ఫిర్యాదు చేసిన ఓఎంసీ కేసు దర్యాప్తు అధికారి, సీబీఐ అదనపు ఎస్పీ ఆర్ఎం ఖాన్.. ప్రధాన సాక్షిగా ఈరోజు కోర్టుకు హాజరయ్యారు. నిందితుల తరఫున న్యాయవాదులు ప్రశ్నలు సంధించగా.. మరోసారి అవకాశమివ్వాలని వారు కోరడంతో విచారణ వాయిదా పడింది.
ఇదీ చదవండి:
ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని దుష్టశక్తుల పన్నాగం: మంత్రి బొత్స