ETV Bharat / city

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ పొడిగింపు

రాష్ట్ర ప్రభుత్వం.. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై విధించిన సస్పెన్షన్‌ను మరో ఆరు నెలల పాటు పొడిగించింది. మంగళవారం నుంచి ఈ పొడిగింపు అమల్లోకి వస్తుందని పేర్కొంది.

ab-venkateswara
ab-venkateswara
author img

By

Published : Feb 3, 2021, 8:01 AM IST

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై విధించిన సస్పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగించింది. మంగళవారం నుంచి ఈ పొడిగింపు అమల్లోకి వస్తుందని పేర్కొంది. సమీక్ష కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఏబీ వెంకటేశ్వరరావుపై అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు, దర్యాప్తు చేసేందుకు అనుమతివ్వాలని ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ ప్రభుత్వాన్ని కోరగా.. గత నెల 19న ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలల పాటు ఆయనపై సస్పెన్షన్‌ కొనసాగించాలని సమీక్షా కమిటీ సిఫార్సు చేసిందని అందులో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

నేటి నుంచి రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.