కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణకు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ప్రభుత్వం మోపిన అభియోగాలకు వ్యతిరేకంగా ఏబీ వెంకటేశ్వరరావు వివిధ ఆధారాలు సమర్పించారు. సాక్షులుగా అనిశా, సీఐడీల్లోని అధికారులను పిలవాలని కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ను కోరారు. సాక్షులుగా సీఎంవోలోని అధికారిని కూడా విచారణకు పిలవాలని విజ్ఞప్తి చేశారు.
దేశ, రాష్ట్ర భద్రతా వ్యవహారాలను పక్కన బెట్టి దేశద్రోహానికి పాల్పడ్డారని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును సర్వీసు నుంచి సస్పెండ్ చేసింది.
ఇదీ చదవండి: పెట్రో ధరల పెరుగుదల: నష్టాల బాటలో రవాణా సంస్థలు..!