Suicide Attempt: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్లకు పాల్పడిన యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో వెలుగు చూసింది. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌కు చెందిన అజయ్ అల్లర్లకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేస్తారేమోనన్న భయంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని మొదటగా ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గత ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో ఫిజికల్ టెస్ట్ పూర్తి చేశానని.. రిటర్న్ ఎగ్జామ్ మాత్రమే మిగిలి ఉందని అజయ్ తెలిపాడు. వాట్సాప్ గ్రూపులో వచ్చిన సమాచారం మేరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నానని అతను ఆవేదన వ్యక్తం చేశాడు.
అసలేెం జరిగిదంటే: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా డిఫెన్స్ అకాడమీ నిర్వాహకులు యువకులను రెచ్చగొట్టడంతోనే.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసానికి కుట్ర పన్నారని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు తేల్చారు. ఈమేరకు రైల్వే కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పొందుపర్చారు. అగ్నిపథక్ వ్యతిరేకంగా బిహార్‌లో జరిగిన అల్లర్లను... కొన్ని డిఫెన్స్ అకాడమీలు.. వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేశాయని... వాటిని చూసి ప్రేరణ పొందిన యువకులు.. 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం సృష్టించారని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: