ETV Bharat / city

న్యాయం కోసం ప్రగతిభవన్‌కు చేరిన కుటుంబం.. అదుపులోకి తీసుకున్న పోలీసులు - A tribal family went to Pragati Bhavan

Tribal Family at Pragathi Bhavan: న్యాయం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రగతిభవన్‌కు వచ్చిన గిరిజన కుటుంబసభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతేడాది తమ కుమారుడు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనపై పునర్విచారణ జరిపించాలని సీఎం కేసీఆర్‌ను కోరేందుకు వచ్చినట్లు ఆ దంపతులు తెలిపారు. సీఎంకు తమ గోడు చెప్పుకొందామని వస్తే పోలీసులు ఠాణాకు తరలించారని వాపోయారు.

మాట్లాడుతున్న బాధిత కుటుంబం
మాట్లాడుతున్న బాధిత కుటుంబం
author img

By

Published : Apr 30, 2022, 5:13 PM IST

మాట్లాడుతున్న బాధిత కుటుంబం

Tribal Family at Pragathi Bhavan: కుమారుడి హత్య విషయంలో నేరస్థులకు శిక్ష పడేలా తమకు న్యాయం చేయాలంటూ.... ఓ గిరిజన కుటుంబం ప్రగతిభవన్‌కు వెళ్లింది. తెలంగాణలోని నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన రాము, లక్ష్మి దంపతుల కుమారుడు శివరామ్​ గతేడాది చనిపోయాడు. కొంతమంది తమ బిడ్డను హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే 8 నెలలుగా తిరుగుతున్నా పోలీసులు తమను పట్టించుకోవడం లేదంటూ బాధితులు ఆరోపించారు.

"గతేడాది మా కుమారుడు చనిపోయాడు. ఎవరో హత్య చేశారు. పోలీసులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. మేమేం కొట్లాడటానికి ప్రగతిభవన్​కు రాలేదు. న్యాయం కోసమే సీఎం కేసీఆర్​ను కలవడానికి వచ్చాం. దయచేసి ఇప్పటికైనా పోలీసులు మా గోడు వినిపించుకోవాలి." -బాధిత కుటుంబం

ఈ మేరకు ఇవాళ ముఖ్యమంత్రిని కలిసి విన్నవించుకునేందుకు ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. వారిని అడ్డుకున్న పోలీసులు.. పంజాగుట్ట పోలీసు స్టేషన్​కు తరలించారు. గోడు వెళ్లబోసుకునేందుకు వస్తే... పోలీసులు తమను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలిస్తున్నారని దంపతులు వాపోయారు. ఇప్పటికైనా పోలీసులు న్యాయం చేయాలని కోరారు.

ఇవీ చదవండి:

వైకాపా ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై.. సొంతపార్టీ నేతల దాడి!

మహిళల భద్రతకే సీఎం పెద్దపీట: హోంమంత్రి తానేటి వనిత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.