ETV Bharat / city

'పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడి పాడు పనులు' - హబూబాబాద్ జిల్లా తాజా నేర వార్తలు

Teacher misbehave with Student : విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన గురువే బాధ్యత మరిచి వంకర బుద్ధి చూపించాడు. విద్యార్థినులను లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. పరీక్షల్లో అధిక మార్కులు కావాలంటే తన కోరిక తీర్చాలని పట్టుబట్టాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు టీచర్​కు దేహశుద్ధి చేశారు.

Teacher misbehave with Student
Teacher misbehave with Student
author img

By

Published : Apr 27, 2022, 8:22 PM IST

Teacher misbehave with Student : భావితరాలకు బడిలో జ్ఞానాన్ని నింపాల్సింది పోయి వారి జీవితాలను అంధకారంలోకి నెట్టేందుకు యత్నించాడంటూ తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లాలో ఓ టీచర్‌ను గ్రామస్థులు చితకబాదారు. పరీక్షలను అడ్డుపెట్టుకుని.. మార్కులను అవకాశంగా చూపి.. బిడ్డల్లాంటి విద్యార్థినులను వేధింపులకు గురిచేశాడు. ఈ ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది.

పాఠశాలకు చెందిన సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు మహేందర్ పదోతరగతి విద్యార్థినుల పట్ల గత కొంత కాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఇదే విషయాన్ని ఓ విద్యార్థిని తమ తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో ఆగ్రహానికి గురైన బాలిక తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు మహేందర్‌ను చితకబాదారు. అనంతరం అతడిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విద్యార్ధినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

'పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడి పాడు పనులు'

"నా బిడ్డ పదోతరగతి చదువుతోంది. గత రెండు నెలలగా నా బిడ్డను వేధిస్తున్నాడు. ఎవరికన్నా ఈ విషయం చెబితే నీపని చెప్తా.. అని బ్లాక్‌మొయిల్ చేస్తున్నాడు. చేతుల మీద కొట్టడంతో పాటు లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. అతడిని కఠినంగా శిక్షించాలి."

- విద్యార్థిని తల్లి

"పిల్లలను చదువుకోవాలని పాఠశాలకు పంపిస్తున్నాం. కానీ సార్ ఇంత మోసం చేస్తాడనుకోలేదు. పిల్లలని ఆగం చేశాడు. ఈ విషయాన్ని మాకు మా అమ్మాయి చెప్పింది. అతడిని వెంటనే సస్పెండ్ చేయాలి."

- విద్యార్థిని బంధువు

ఇదీ చదవండి: కీచక అధ్యాపకుడికి దేహశుద్ధి... సస్పెండ్​ చేసిన ప్రిన్సిపల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.