తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో ప్రకృతి మంచుదుప్పటి కప్పుకుంది. నేరడ శివారు అటవీ ప్రాంతంలో మంచు బిందువులతో నిండి ఉన్న ఓ సాలెగూడు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునేలా ఉంది. చూడటానికి భూగోళం పటంలా కనిపిస్తోన్న ఈ మంచు ముత్యాల సాలెగూడు.. ఈటీవీ భారత్ కెమెరాకు చిక్కింది. అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన ఈ గూడు.. ఓ దారం ఆధారంగా వేలాడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే దారం కూడా సాలె పురుగు అల్లినదే కావడం గమనార్హం.
ఇదీ చదవండి: