ETV Bharat / city

శునకానికి చక్రాల బండి.. ఔరా అనకుండా ఉండరు..!

రోడ్డుపై వెళ్తున్నప్పుడు తననేమీ చేయకపోయిన శునకం రాయివేసిన వారిని చూసుంటాం.. ఇంటికొచ్చిన గ్రామ సింహాన్ని తరిమి తరిమి కొడతాం. కానీ ఓ గ్రామీణ వైద్యుడు ఓ శునకం పట్ల చూపిన కరుణ కనిపిస్తే అబ్బా..! ఏమి చేశాడు అని అనుకోక మానము. ఇంతకీ అతను ఏమి చేశాడంటే..

wheels arranged for dog
శునకానికి చక్రాల బండి
author img

By

Published : Jan 6, 2021, 12:58 PM IST

శునకానికి చక్రాల బండి

ప్రమాదంలో గాయాల పాలైన ఓ శునకం పట్ల ఓ గ్రామీణ వైద్యుడు చూపిన కరుణ ఆ శునకానికి కొత్త నడకను ఇచ్చింది. రెండు కాళ్లను కోల్పోయిన వీధి శునకం ఇప్పుడు రెండు కాళ్లు, రెండు చక్రాలతో సులువుగా నడవగలుగుతోంది.

తెలంగాణ ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం సింగరాయపాలెం గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడు షేక్‌ ఆషా కొద్ది రోజుల క్రితం తన నివాసానికి దగ్గర్లో ఓ వీధి శునకానికి నడుము, కాళ్లు విరిగిపోయి ఉండటాన్ని గమనించారు. దాన్ని చేరదీసి ఇంట్లో చిన్న పిల్లలు ఆడుకునే చక్రాల బండికి మార్పులు చేర్పులు చేసి శునకం నడుముకు ఇలా అమర్చారు. ఇప్పుడా శునకం ఓ జత కాళ్లు, జత చక్రాలతో పరుగందుకుంటోంది. ఇది చూసిన వారు ఔరా..! ఇలా కూడా చేయొచ్చా అనుకోకమానరు.

ఇదీ చూడండి:

రాష్ట్రానికి ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమల వెల్లువ.. పెరిగిన ఉపాధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.