ETV Bharat / city

Minor Girl Rape Case: బయటికెళ్లిన బాలికపై అత్యాచారం.. ఆపై..! - పాతబస్తీలో దారుణం

Minor Girl Rape case: ఇంట్లో వారితో గొడవపడి బయటికెళ్లిన బాలికను కామాంధులు కాటేశారు. ఆ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా వ్యభిచారం కూడా చేయించారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటు చేసుకుంది.

Minor Girl Rape case
బయటికెళ్లిన బాలికపై అత్యాచారం.. ఆపై..!
author img

By

Published : Jan 4, 2022, 9:38 PM IST

Minor Girl Rape Case: తెలంగాణలోని హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. అర్ధరాత్రి ఒంటరిగా కనిపించిన బాలికపై కామాంధుల కన్ను పడింది. ఆ బాలికపై అత్యాచారం చేయడంతో పాటు మత్తు మందు ఇచ్చి వ్యభిచారం కూడా చేయించారు.

ఇంట్లో వారితో గొడవపడి..

lod city in hyderabad: హైదరాబాద్ పాతబస్తీ కిషన్ బాగ్ ప్రాంతానికి బాలిక నవంబర్ 20వ తేదీన ఇంట్లో తన అక్కతో గొడవ పడి బయటకొచ్చింది. డిసెంబర్ 1వ తేదీ బాధిత బాలిక తల్లి బహదూర్ పురా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధిత బాలిక ఆచూకీ సమాచారం మేరకు పోలీసులు ఓ ఇంటిపై దాడి చేసి బాలికను రక్షించగా.. విస్తుపోయే నిజాలు తెలిశాయి.

ఆటో డ్రైవర్​ అతని స్నేహితునితో కలిసి దారుణం
prostitution with girl: ఇంటి నుంచి బయటకు వెళ్లిన రోజు రాత్రి బాలిక రోడ్డుపై ఉండగా కొందరు యువకులు వెంబడిస్తే ఓ ఆటో డ్రైవర్ గమనించి ఆకతాయిల నుంచి రక్షించాడు. బాలిక వివరాలను ఆటో డ్రైవర్ ఆరా తీయగా ఇంటికి వెళ్లనని చెప్పడంతో ఆటో డ్రైవర్ సమీర్, అతని స్నేహితుడు హఫీజ్​తో కలిసి బాధితురాలిని అత్తాపూర్​ పరిధిలోని ఉప్పర్​పల్లిలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్లారు. ఆపై ఇద్దరూ బాలికపై అత్యాచారం చేసి మైలార్​దేవ్​పల్లి ప్రాంతంలో ఇద్దరు మహిళల సాయంతో ఓ ఇంట్లో ఉంచి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని బహదూర్​ పురా సీఐ దుర్గా ప్రసాద్ తెలిపారు. బాలికకు మత్తు మందు ఇచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని సీఐ తెలిపారు.

లోకేషన్ ఆధారంగా..
girl rescued: బాలిక అదృశ్యం కేసులో దర్యాప్తు చేస్తున్న బహదూర్​ పురా పోలీసులకు బాధితురాలి అక్క ఫోన్​కు బాలిక లోకేషన్ పంపింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మైలార్​దేవ్​ పల్లి అలీనగర్​లోని ఓ ఇంట్లో దాడి చేసి బాలికను రక్షించారు. అక్కడే ఉన్న ముఠాలోని ఇద్దరు మహిళలను అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

మైనర్​ బాలిక అక్కతో గొడవపడి నవంబర్ 20న ఇంటినుంచి బయటికెళ్లింది. మాకు డిసెంబర్​ 1న బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. దీనిపై కిడ్నాప్ కేసు నమోదు చేశాం. నిన్న బాధిత బాలిక తన అక్కకు ఇన్​స్టాగ్రామ్​లో లోకేషన్ షేర్ చేయడం జరిగింది. మేము అక్కడికి వెళ్లి ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నాం. వీరు ఆటో డ్రైవర్ సమీర్, అతని స్నేహితునితో కలిసి వ్యభిచారం చేయించారని తెలిసింది. కొంతమంది అబ్బాయిలు బాలికను వెంబడించగా ఆమె భయపడి ఆటోలో ఉన్న వ్యక్తిని సాయం కోరింది. అదే సమయంలో బాలికను సమీర్​, హఫీజ్​తో కలిసి అత్తాపూర్​కు తరలించారు. తర్వాత మైలార్​దేవ్​పల్లికి బాలికను తరలించి మత్తుమందు ఇచ్చి వ్యభిచారం చేయించారని తెలిసింది.

-దుర్గా ప్రసాద్, బహదూర్​ పురా సీఐ

ఇవీ చూడండి:

  • Rape On Girl: బాలికపై అత్యాచారం.. పాఠశాలకు వెళ్తుండగా..!
  • VISHAKA CRIME: విశాఖ జిల్లాలో భార్యను చంపి భర్త ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.